Diabetes and Eye
(మధుమేహం కళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది? )
+918688248820
(మధుమేహం కళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది? )
మధుమేహం కళ్ళను ఎలా ప్రభావితం చేస్తుంది?
రక్తంలో గ్లూకోజ్ చాలా కాలంగా ఎక్కువగా ఉంటే, అది కంటిలోపల వుండే రెటీనా అనే కంటి నరముల పొరలోని చిన్న రక్త నాళాలను దెబ్బతీస్తుంది. దెబ్బతిన్న రక్త నాళాలు కొన్ని ద్రవములను లీక్ చేసి వాపుకు కారణమవుతాయి.అంతే కాక కొత్తగా తయారయ్యే రక్త నాళాలు బలహీనమైనవి గ ఉంటాయి . ఈ రక్త నాళాలు పగిలి కంటి మధ్య భాగంలోకి రక్తస్రావం కావచ్చు, కంటి నరాముల పొరలొ మచ్చలకు దారితీయవచ్చు లేదా కంటి లోపల ఉండే కంటి ప్రెషర్ ను ప్రమాదకర స్థాయికి పెరగవచ్చు . తీవ్రమైన డయాబెటిక్ కంటి వ్యాధులు మొదట రక్తనాళాల సమస్యలతో ప్రారంభమవుతాయి.
మధుమేహం వలన కంటి దృష్టి లోపం కలిగించే నాలుగు కంటి వ్యాధులు
1 డయాబెటిక్ రెటినోపతి
రెటీనా అనేది ప్రతి కంటి లోపల వెనుక భాగంలో ఉండే నరముల పొర. రెటీనా కాంతిని గ్రహించి, ఆ కాంతిని మెదడు కు అర్ధమయ్యే సంకేతాలుగా మారుస్తుంది, తద్వారా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడవచ్చు. మధుమేహం వలన దెబ్బతిన్న రక్త నాళాలు రెటీనాకు హాని కలిగించి , డయాబెటిక్ రెటినోపతి అనే వ్యాధికి కారణమవుతాయి .
ప్రారంభ డయాబెటిక్ రెటినోపతిలో, రక్త నాళాలు బలహీనపడవచ్చు, ఉబ్బవచ్చు లేదా రెటీనాలోకి లీక్ కావచ్చు. ఈ దశను నాన్ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు.
వ్యాధి మరింత తీవ్రమైతే, కొన్ని రక్త నాళాలు మూసుకుపోతాయి, దానివలన రెటీనా ఉపరితలంపై కొత్త బలహీన రక్త నాళాలు పెరగగి విస్తరిస్తాయి . ఈ దశను ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిఅంటారు.
డయాబెటిక్ రెటినోపతి వలన దృష్టి పుర్తిగా కోల్పోయే అవకాశం ఉంది
2 డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా
రెటీనాలోని అత్యంత ముఖ్యమయిన భాగం మాక్యులా. చదవడానికి, డ్రైవింగ్ చేయడానికి మరియు దేనినయినా చూడడానికి అవసరమైన భాగాన్ని మాక్యులా అంటారు. డయాబెటిస్ మాక్యులాలో వాపుకు దారితీస్తుంది, దీనిని డయాబెటిక్ మాక్యులర్ ఎడెమా అంటారు. కాలక్రమేణా, ఈ వ్యాధి కంటిలోని ఈ భాగంలో పదునైన దృష్టిని నాశనం చేస్తుంది, ఇది పాక్షిక దృష్టి నష్టం లేదా అంధత్వానికి దారితీస్తుంది.
3 గ్లౌకోమ ( నీటి కాసు )
గ్లౌకోమ అనేది కంటిని మెదడుకు కలిపే నరాల కట్ట అయిన ఆప్టిక్ నాడిని దెబ్బతీసే వ్యాధి . మధుమేహం ఉన్నవారి లో గ్లౌకోమ వచ్చే అవకాశం మధుమేహం లేని వారి కంటే రెండింతలు. ఇది త్వరగా చికిత్స చేయకపోతే దృష్టి నష్టం మరియు అంధత్వానికి దారితీస్తుంది.
4 కంటిశుక్లం
మన కళ్లలోని లెన్సులు స్పష్టమైన నిర్మాణాలు, ఇవి పదునైన దృష్టిని అందించడంలో సహాయపడతాయి. అవి వయస్సు పెరిగే కొద్దీ సృష్టత్వాన్ని కోల్పోయి మబ్బుగా మారతాయి. మధుమేహం లేనివారి కంటే మధుమేహం ఉన్నవారికి తక్కువ వయస్సులోనే కంటిశుక్లం ఏర్పడుతుంది. మధుమేహం ఉన్నవారి లో కంటిశుక్లం వచ్చే అవకాశం మధుమేహం లేని వారి కంటే రెండింతలు.
ఎవరికి డయాబెటిక్ కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది?
మధుమేహం ఉన్న ఎవరైనా డయాబెటిక్ కంటి వ్యాధి రావచ్చు.
అధిక రక్తపోటు,అధిక రక్త కొలెస్ట్రాల్ మరియు ధూమపానం కూడా డయాబెటిక్ కంటి వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
షుగర్ వున్న 100 మందిలో 75 మందికి 20 సంవత్సరాలలో కంటి నరములు దెబ్బతింటాయి ....
షుగర్ తో వచ్చే కంటి నరముల వ్యాధికి శాస్వత చికిత్స అత్యంత కష్టము మరియు ఖరీదుతో కూడుకున్నది .... ప్రారంభ దశలో మధుమేహ కంటి వ్యాధిని గుర్తించినట్లయితే దానిని ముదరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే కంటి చూపును కాపాడటం తో పాటు తక్కువ ఖర్చు తో వైద్యం చేయవచ్చు .
మధుమేహం ఉన్న వారు పూర్తి కంటి పరీక్ష కోసం తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి నిష్ణాతుడయిన కంటి డాక్టరును సంప్రదించాలి.
మధుమేహం కంటి సమస్యలను వైద్యులు ఎలా నిర్ధారిస్తారు?
డయాబెటిక్ కంటి వ్యాధిని నిర్ధారించడానికి నిష్ణాతులైన కంటి వైద్యులను కలవటం అవసరం . కంటి డాక్టర్ మీ కళ్ళలో కనుపాపలు పెద్దవిగా చేయడానికి మీ కళ్ళలో మందు చుక్కలు వేస్తారు.ఆ తరువాత ఇది ఒక ప్రత్యేక లెన్స్‌ని ఉపయోగించి కంటి వెనుక ప్రాంతం లోని రెటీనా ను పరీక్షా చేస్తారు . ఈ పరీక్ష తర్వాత కొన్ని గంటల వరకు దృష్టి అస్పష్టంగా ఉంటుంది,తరువాత మాములుగా అయిపోతుంది . మధుమేహ వ్యాధి వున్నవారు ప్రతి సంవత్సరానికి ఒక్క సారి ఇలా పరీక్షా చేయించుకోవాలి .
What is Diabetes?
Diabetes mellitus is a condition which affects millions of Indians.
It impairs the body’s ability to use and store sugar. Elevated blood sugar levels and excessive thirst and urination are the indicators of Diabetes. It can affect vision by causing damage to the blood vessels of the retina, or a higher incidence of cataract and glaucoma.
What is Diabetic Retinopathy?
In advanced or long standing Diabetic persons, the blood vessels in the retina are damaged and leak fluid or blood. The longer a person has Diabetes, the more is the risk of developing Diabetic Retinopathy.
What are the symptoms of Diabetic Retinopathy?
Early Diabetic retinopathy usually has no symptoms. Gradual blurring of vision may occur if fluid leaks in the central part of the retina (the macula). In late Diabetic Retinopathy (proliferative stage), new abnormal blood vessels begin growing on the surface of the retina or the optic nerve. These vessels have weak walls and leak blood out into the retina and vitreous (the jelly that fills most of the eye). Presence of blood in the path of light entering the eye blocks vision, resulting in impaired vision or vision loss.
How is Diabetic Retinopathy diagnosed?
A complete eye examination is required for the detection of Diabetic Retinopathy. We perform a painless examination of the retina using an instrument called the indirect ophthalmoscope after dilating the pupils. If diabetic retinopathy is found, a special test called fundus fluorescein angiography (FFA) may be performed where a dye is injected in the vein and photographs of the retina are taken to pin point or locate the areas of leakages. Other tests like OCT Macula are done to confirm / quantify the disease.
How is Diabetic Retinopathy treated?
Intra Ocular Injections.
Injection of latest anti VEGF molecules can improve the condition
Laser
Laser photocoagulation involves the focusing of a powerful beam of laser light on the damaged retina to seal leaking retinal blood vessels and stop abnormal blood vessel (neovascularization) growth.
Surgery
Vitrectomy – In the event of the patient presenting with very advanced diabetic retinopathy, a surgical procedure known as vitrectomy is recommended. Blood-filled vitreous gel of the eye is replaced with a clear solution to aid in restoring vision. Sometimes the retina may also be detached and then the surgery involves reattaching the retina as well.
How to prevent visual loss in Diabetes?
Prevention of Diabetic Retinopathy and accompanying visual loss is a team effort involving the patient, the Physician and the Eye Specialist. Early detection of Diabetic Retinopathy is the best protection against loss of vision. All diabetics must have their retinas examined at least once a year.